Monday, December 13, 2010

నా కలలు...

నా కలలు...
సినిమాలలో చూపించినట్టు మిమ్మల్ని నేనిప్పుడు నా స్వప్న లోకం లోకి తీసుకెళ్ళబోతున్నాను....నా స్వప్న లోకమంటే....నా స్వప్నాలు...ఎలా నిజమయ్యి ఈ లోకం లో నాకెదురయ్యయో మీకు పరిచయం చెయ్యబోతున్నాను....మనిషి నమ్మి అనుకుంటే....నిర్మలం గా మనసుని ఉంచుకుంటే...ఆ పై తన కలలని గమ్యాలని తనలో నిక్షిప్తం చేసుకుంటే...తన కర్తవ్యమే తాను గా భావించుకుంటే...చెయ్యలేనిది...చేరలేనిది లేదు....అన్ని కలలూ నిజమవ్వవు...వటిలో నిజాయతీ...నిర్మలత ఉంటే తప్ప... !!!

ఇక నా అనుభవాలు....
కలలు కలలు...అని నా స్వోత్ఖర్ష లో నేను రశినట్టుగా....నా కలలు చాలా నిజమయ్యాయి....అవి ఉత్త కలలే అని నేను అనుకొని ఉంటే అది నా పొరబాటే...ఆ కలల ని ఇక్కడ ప్ర్స్తవించలని...అవి ఏ క్రమం లో నిజమయ్యయో చెప్పలని నా ఈ ఆరాటం...

నాకు సినిమాలంటే తగని మోజు....సినిమాలు ఈ విధం గా తియ్యలనీ....ఈ విధం గా ఉంటే బాగుంటుందనీ...చాలా విధాలు గా అనుకునేవాడిని నేను ఇంటర్ లో ఉన్నప్పుడు...ఇంకా సినిమ ఫీల్డ్ కి చాలా దగ్గరగా ఉండాలని కోరుకునే వాడిని....ఉద్యొగం వస్తే హైదరాబద్ కి ఎదొ ఒక కారణం చెప్పి వెళ్ళాలని..చాలా మంది పాత తరం కొత్త తరం దర్శకులని...నటులని...ఇంకా ఎంతో మంది సినీ దిగ్గజాలని కలుసుకోవాలని...వాళ్ళ అనుభవాల నుంచి నేర్చుకోవాలని...కోరిక ఉండేది...అంతే కాదు ఒక పాటల రచయత గా అవ్వలని ఎన్నో కలలు కనే వాడిని....

ఇవన్నీ నా కలలు....కలలు అంటే...పగటి కలలు కాదు గట్టి కలలు...నాలో నిద్రాణమై పొఇన నా ఉచ్చ్వాశ నిస్వాశలు....ఆ కలలు ఎంత ఘదమైనవి అంటే...నన్ను నేను మర్చిపోయి నేను వాటిలో లీనమైపోయేంత...నా గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు...ఆ కలల గురించి మత్రమె ఆలోచించాను....అవి లేకుంటే అనె ఆలోచన అసలు వచ్చేది కాదు...అలా అని అవె నా ప్రపంచం...అవే నా ప్రాణం అని అనుకోలేదు...వాటిని సాధించటం కోసమే ఎమొ నేను ఉన్నది అని అనుకొని...నా ఇతర కలలని గమ్యలని అనుకుంటూ....వచ్చే ప్రతీ మలుపు ని ఆస్వాదిస్తూ..ఆ పై కలల గురించి అలోచించటం మర్చిపొయి...పట్టించుకోకుండా...నా పని నేను చెసుకుంటూ గడిపాను...!!!
నిద్ర పొయెటప్పుడు యదృచ్చికం గా వచ్చిన కలలు కావవి...నన్ను నిత్యం నిలబెట్టిన గమ్యాలు...నడిపించిన మార్గాలు...

నా లిఫె లో ఎప్పుడో ఒక సరి జరిగితే చాలు అనుకున్న అద్భుతం...నా కళ్ళా ముందు అచిరకాలం లోనే ఆవిష్క్రుతమైనది...

1)పాటల రచయత గా అవకశం...
నేను ఎవొ కవిత లురాసుకునే వాడిని...అవి ఎవరినో మెప్పించాలనో ....ఇంకా ఎవరి మన్ననలు పొందాలనో కాదు...నా మనసు పలికీన భావలని అక్షరాలు గా ఆ సరస్వతి నాకిచ్చిన వరం గా భవిస్తూ...నేను అనుకున్నది అలా రాసుకుంటూ వచ్చను...అవి కొనదరికి చూపెట్టటం కాకతాలీయమే...నా ఉద్దెశ్యం ఈ కవితలతో పాటల రచయత గా అవ్వలని ఏ మత్రం కాదు...ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయలేదు...కాని ఈ కవితలు చదివి మెచ్చుకున్న ఒకాయన...నాకు తను తీయబొయె సినిమా లో చంచె ఇస్తనని..ఇది మాట వరసకు చెప్పింది కాదని...గట్టిగా మాటిచ్చాడు...
ఇది యాదృచ్చికమో ఎమొ తెలియదు....నా కల నిజమయ్యింది...పాటల రచయత గా అవకశం రావటం... ఆ అవకాసాన్ని..నేను ఉపయొగించుకున్ననో లేదో నా కలలకి అనవసరం....!!! అవకసం వరకే వాటి పని అంతే..!!!

2)సినిమా ఫీల్డ్ కి దగ్గర గా...
నా ఉద్యొగం ఊహించని ఎన్నొ ఆశ్చర్యాలకి లోను చేసింది.....కరూర్ వైశ్యా బాంక్ లో ప్రొబేషినరి ఆఫీసర్ గా ఉద్యోగం వచ్చింది...పోస్టింగ్ జూబ్లీహిల్స్ లో....ఇక్కడే నా కలల్లో ని గాఢథ అవి నిజమైన విధానం...కాలం నన్ను పరీక్షించి నిరీక్షింప చేసిన విధానం చెప్పాలి...

నన్ను...నా తో పాటు ఇంకొక అతన్నీ జూబ్లీహిల్స్ లో వేసారు...కానీ జూబ్లీ హిల్స్ కి ఇద్దరు ఆఫీసర్లు అవసరం లేదని...ఒకర్ని మైన్ బ్రాంచ్ కి వెయ్యలని అన్నరు...అప్పుడు ఆ ఇంకొక అతన్నే మైన్ బ్రాంచ్ కి వేసి...నన్ను జూబ్లీ హిల్స్ లో నే ఉంచారు....

సో సినిమా ఫీల్ద్ కి దగ్గర గా హైదరబాద్ లో ఉండాలాన్న నా కల ఒకటి, ఏ కష్టం నేను పదకుందానే తీరిపొఇంది...ఉద్యోగం లో చేరాక ఎలగైన హైదరాబాదు వెళ్ళి తీరాలన్న నా కోరిక...హైదరబాదు జూబ్లీహిల్స్ లో పొస్టింగ్ పడటం తో నమ్మలేని ఆశ్చర్యానికి...ఆనందానికి..నన్ను గురిచేసింది....

3)ఇక ముఖ్యమైన వ్యక్తులని కలుసుకోవటం....
నేను ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవాలంటే...అది సామన్యమైన విషయం కాదు..కలుసుకోవటం వేరు...వారి తో అనుబంధం కొనసాగించటం వేరు...నాకు బాంకింగ్ అంటే చాలా కొత్తగా ఉండేది...ఎన్నో పొరబాట్లు చేసేవాడిని...అర్థమయ్యేది కాదు ఒక పట్తన ఏది...!!!ఆ తైం లో మా బాంక్ లో గోల్దన్ విజన్ అని 2016 కి లక్ష కోట్ల బిజినెస్స్ చెయ్యలని...అందుకోసం ఇప్పటి నుంచే మర్కేటింగ్ లో పట్టు సాదించాలని...కష్తమర్ బేస్ పెంచుకోవాలని...కొన్ని ఎంపిక చేసిన బ్రాంచీలలోనే ఈ గోల్డన్ విజన్ ఏర్పాటు చేసారు....
ఆ ఎంపిక చేసిన బ్రాంచి లలో జూబ్లీహిల్స్ ఒకటి...

అయితే నేను మార్కెట్టింగ్ ఆఫీసర్ ని కాను...కొత్తగా చేరిన ప్రొబేషినర్య్ ఒఫ్ఫిసర్ ని...ప్రొబషన్ లో మర్కేట్తింగ్ ఆఫీసర్ ఇవ్వటం అరుదు...అందులోనూ అదీ జూబ్లీహిల్స్ లాంటి వీఅయిపీ లు ఉన్న ఏరియాలలో...ఇంకా కష్టం....కాని నన్ను మా బ్రాంచ్ లో కష్టమర్ రిలేషన్షిప్ ఆఫీసర్ గా వేశారు...అదీ సరదాగ ఆయాచితం గా కాదు...నకన్నా సీనియర్స్ ఉన్నా కూదా...అందరినీ అడిగాక...ఎవ్వరికీ కరక్టుగా ఈ పొజిషన్ సరిపోక...చివరకి నా దగ్గర వచ్చి ఆగింది..నేను అడిగింది కాదు...నాకు తెలిసింది నేను చేసిందల్లా...నాకు అది ఇంటరెస్టింగ్ అని చెప్పటమే...

నేను ఇప్పుడు కాదనుకున్నా, నా ఉద్యోగం లో భాగం గానే...నేను పైన చెప్పిన వాళ్ళందరినీ కలవాలి...తప్పకుండా నేను వల్లతో రెలేషన్ మైంటైన్ చెయ్యాలి...ఎందుకంటే నేను కష్టమర్ రిలేషన్ ఆఫీసర్ ని కనుక....

ఇవన్ని జరిగిన వస్తవాలు...నేను ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాన..లేక జారవిడుచుకుంటానా అన్నది నా శక్తి సామర్ధ్యాలపై ఆధార పడి ఉన్న విషయం...అప్పటి నా ఇష్టం ఇంకా అలానే ఉంటే...అంతే కసి ఇంకా నాలో ఎల్లప్పుడోఓ ఉంటే..ఇంకా నేను అనుకున్న కల పై నాకు నమ్మకం అలానే ఉంచగలిగితే...ఇంకా సినిమాలో చెయ్యలని సంకల్పిస్తే....నేను ఆ గమ్యలని చేరుకోవచ్చు...ఇవేవి లేకపోతే....ననెఉ ఇక్కడే ఆగిపోవచ్చు....నేను సాధించన లేదా అన్నది నా మీద ఆధార పడి ఉన్నది...కాని అవన్ని నాకు దగ్గర చేసిందీ మాత్రం నా కలే...నా ఎనలేని ఇష్టాలే...నేను ఎల్లప్పుడోఓ నమ్మే...ఆ భగవంతుడే...

అన్ని కలలూ నిజమౌతాయా అంటే అవ్వవు....కలకి నిజాయతి ఉండాలి...స్వచ్చత ఉందాలి...స్వార్థం ఉందకూడదు...ఎప్పుడూ అది జరగదని అనుకోకూడదు...నిరుత్సాహ పడకూడదు...నాకేంటి అని ఆ కలలని అడగ కూడదు....ఓపిక గా వాటిని నమ్మాలి...జరుగుతున్నదంతా మన మంచికే అనుకోవాలి...ఆ కలే మనం గా భావించాలి...ఆ కలని మనను వేరు గా భావించకూడదు...ఎప్పుడైతే ఆ కల లోకి నేను అనే అహం ప్రవేశిస్తుందో...నాకేంటి అనె ప్రశ్న ఉద్భవిస్తుందో...ఆ కల పై మనకు నమ్మకం పోతుంది...ఆ కలకి కూడా మన పై విస్వాశం పోతుంది...అప్పుడవి ఉత్త కలలే...హా ఇంకో విషయం....నాకు సరైన ఉద్యోగం రాలేదని...కాంపుస్ సెలక్షన్స్ లో సెలక్ట్ అవ్వలేదని...చాలా బాధ పదే వాడిని...ఇంజినీరింగ్ లో....ఇంకా ఉద్యోగం మంచిది ఎప్పుడొస్తుందో అని విచారించే వాదిని...ఎన్నో పరీక్షలు...ఎన్నో ప్రశ్నలు...నా కలల పై అనుమానాలు..నా మీద నాకే అనుమానం కలిగించే సంఘటనలు....నేను ఎదొ సాధించానని చెప్పటలెదు....నేను ఎదో సాధించ్చేందుకు...నా కలలు నాకో మార్గాన్ని చూపాయి...వాటి లో పయనించాల్సిన బధ్యత నాది....ఇక మిగిలింది మనమే చెయ్యలి...కలలు మనకో గమ్యాన్ని...ఒక అవకాసాన్ని మాత్రమే ఇస్తాయి....వాటిని సద్వినియొగం చేసుకోవల్సింది మనమె....మీ మనసు ఎంత ధృఢమైనదైయితే..ఎంత నిర్మల మైనదైయితే..ఎంత స్వ్చ్చం గా కలలని ప్రేమించగలిగితే...మిమ్మల్ని మీరు ఆ కలలలో మర్చిపోగలిగితే...అంత త్వరగా మీ కలా నిజమౌతుంది....

ఇక్కడ కల అంతే నేను ఉద్యొగం సంపాదించాలనే...ఉద్యొగం సంపాదించాకా ఆ డబ్బుతో కార్లు..ఇళ్ళు షేర్లు...కొని....కోటీశ్వరుడి కూతుర్ని పెళ్ళాడి...ఆనందంగా కోట్లు గదిస్తూ...హాయిగా పదవీ విరమణ చెయ్యటం కాదు...!!! అది మనం గుర్తుంచుకోవాలి....ఎం చెయ్యలన్నది మన బధ్యత ఎలా చెయ్యలి అన్నది...ఆ భగవంతుని ఇష్టం..ఆ కలల కర్తవ్యం..!!!

చివరిగా భగవద్గీత లో చెప్పినట్టుగా....కర్తవ్యం ఆచరించటం వరకే మనకి హక్కు...వాటి ఫలితాలపై కాదు....
కలలకి కూడా అంతే....!!! నాకు ఈ ఫిలాసఫ్య్ ఏ జి క్రిష్ణమూర్థి గారు రాసిన పుస్తకాల లోంచి అబ్బింది...వారికి నా కృతజ్ఞతలు...ఆయన పుస్తకాలు చదివితే మీకు మరింత విపులం గా అర్థమౌతుంది...!!!కలల గురించి...వాటి శక్తి గురించి....!!!

Saturday, September 25, 2010

నిండు చందమామ


నింగి లో ఉన్నడూ నీలాటి వాడొకడు..
మచ్చ ఉన్నా మహా అందగాడు...
నేలనెన్నడూ కలువనంటాడు...
నీటి లోని కలువపూలకే ఱేడు...

నానాటికి తరుగుతున్నా చిరునవ్వు గా మారుతాడు...
దినిదినాభివృద్ధి జరుగుతున్నా తన ఉనికి మించి పోడు...
వడగాలుల్లో తన వొడలు కాలుతున్నా....వేడిమి ఎన్నడూ చూపడు...
చల్లని వెన్నేల్లు తప్ప వేరేమి ఎరిగడు నిండు చందురూడు...

సహస్ర కోటి తేజో విరాజిత సూర్యుడు పగటినున్నా...
శత సహస్ర తరామణులెన్ని తన తోటే వెలుగుతున్నా...
గగనసీమనేలేటి రారాజు చందమామ...
నేటినీ రేపటిని విభజించు ఘనత జాబిల్లిదే సుమా..!!!

రవి లేని రేయి నిశి కి జడిసి జాబిల్లి ని తెచ్చుకుంది...
సరిలేని పండు వెన్నేల్ల పంట తన రాజ్యాన పండించుకుంది...
తమ్ముని జాడ తెలియలేదని ధాత్రి కోపగించుకుంది..
దివి పైన అలిగి చీకటి చీర తొడిగి అమవాస గా ప్రకటించుకుంది.. !!!

Tuesday, June 8, 2010

ఆనందో బ్రహ్మ...















లైఫ్ ఈజ్ ఈజీ ...
డోంట్ బీ క్రేజీ..
సో కాల్డ్ లేజీ...
వదిలెయ్ రా బుజ్జి..

ఎండా కాలం ఎండ్ అయిపొదా వర్షం పడితే...
వర్షాలైన ఆగిపొవా ఆకు రాలుతుంటే...

ప్రాబ్లం కూడా ఉండదు నిత్యం నీవెంటే...
సొల్యూషనే దొరకదు దఃఖం నీ ఫ్రెండైతే...

కోపం తో నేస్తం చేస్తూ...
ముసుగును మనసుకి తగిలిస్తూ...
ఆనందాన్ని డబ్బుల్లో దాచేస్తూ...
నిన్ను నీవు మోసం చేస్తూ...

ఇలా నిన్నలన్నింటిని నింపేస్తే...
దిగులుతోనే కాలం గడిపేస్తే...
నేటికి రేపుండదని నీకు తెలిస్తే...
క్షణానే నీ శ్వాస నిలిస్తే...

తీర్చగలవా ఆగిపొయిన గుండేలోని ఆశలని ఆనాడు...
అయ్యో మిస్సయ్యానంటే తిరిగి రాదుగా ఏనాడు...

అందుకే...
చెయ్యలనుకున్నవి చెసేసై...
తప్పులు చేస్తే వదిలేసెయ్...
నిందించటం ఇక మానేసెయ్...
చిరునవ్వులతో నీ లోకం నింపేసెయ్...

ఇచ్చేవాడివి నువ్వైతే ఎడుపంటూ నీకుండదులే...
ఇంకోడికివ్వాలంటే అసలంటూ మనకుండాలిలే...
ఎవ్వరికీ ఎమీ ఇవ్వకుంటే పుట్టీ ఎమీ సాధించనట్టే...
సాధించిందంతా పంచేస్తే పోయినా ఇంకా మిగిలినట్టే...

Wednesday, May 26, 2010

మనసైన మావాడా.. ఓ ఎడారి ఓడ...



ఎడారి అందాల సుందర నావా...
ఎండమావుల లో ఒంటరైనావా...

సరదా సోయగాల బావ లా...
మా ఊరి వైపు రావా...

సంతోషాల త్రోవ లో...
మము ఎక్కించుకు పోవా...



ఇసుక తోటలోని పూవా...
రవికాంతుల అందెల మువ్వా...


నిలువెత్తు దాహానికి రూపానివా ...
సడలని నిగ్రహపు విగ్రహానివా...


అలుపెరుగని పయనానికి గుర్తై నిలిచవా...
ఆకలి దప్పికలో గమ్యన్నే మరిచావా...!!!