Saturday, September 25, 2010

నిండు చందమామ


నింగి లో ఉన్నడూ నీలాటి వాడొకడు..
మచ్చ ఉన్నా మహా అందగాడు...
నేలనెన్నడూ కలువనంటాడు...
నీటి లోని కలువపూలకే ఱేడు...

నానాటికి తరుగుతున్నా చిరునవ్వు గా మారుతాడు...
దినిదినాభివృద్ధి జరుగుతున్నా తన ఉనికి మించి పోడు...
వడగాలుల్లో తన వొడలు కాలుతున్నా....వేడిమి ఎన్నడూ చూపడు...
చల్లని వెన్నేల్లు తప్ప వేరేమి ఎరిగడు నిండు చందురూడు...

సహస్ర కోటి తేజో విరాజిత సూర్యుడు పగటినున్నా...
శత సహస్ర తరామణులెన్ని తన తోటే వెలుగుతున్నా...
గగనసీమనేలేటి రారాజు చందమామ...
నేటినీ రేపటిని విభజించు ఘనత జాబిల్లిదే సుమా..!!!

రవి లేని రేయి నిశి కి జడిసి జాబిల్లి ని తెచ్చుకుంది...
సరిలేని పండు వెన్నేల్ల పంట తన రాజ్యాన పండించుకుంది...
తమ్ముని జాడ తెలియలేదని ధాత్రి కోపగించుకుంది..
దివి పైన అలిగి చీకటి చీర తొడిగి అమవాస గా ప్రకటించుకుంది.. !!!