ఎంత గొప్పదీ నా జాతి!
ఎంత ఘనమో తన సంస్కృతి!!
ధర్మ మార్గాన్నే జీవించమన్నది!
తనకు మించిన ధర్మం కూడదన్నది!!
కర్మ వరకే నీ హక్కన్నది!
కర్మఫలం వదిలేయమన్నది!!
పరోపకారార్థమే ఈ శరీరమన్నదీ!
ప్రాణులంతా సమమన్నది!!
ఎంత గొప్పదీ నా జాతి!
ఎంత ఘనమో తన సంస్కృతి!!
అర్థము కొరకే జీవించుట వ్యర్థమన్నది!
అర్థవంతమైన సంఘం కోరమన్నది!!
పెద్దల యెడ గౌరవం ఉంచమన్నది!
ఆ గుణమే నీ ఆత్మగౌరవం పెంచునన్నది!!
కనీ, పెంచే దైవాలను పూజించమన్నదీ!
కనిపించని దైవానికి అది అందునన్నది!!
ఎంత గొప్పదీ నా జాతి!
ఎంత ఘనమో తన సంస్కృతి!!
దైవం వేరెచటో లేదన్నది !
నీలోని దైవాన్ని వెతకమన్నది !!
శరణంటే శతృవునైనా క్షమించమన్నది !
నీలోని శతృవులపై కినుకు వహించకన్నది!!
ఏకపత్నీ వ్రతం గొప్పదని చాటి చెప్పినదీ!
కర్తవ్య నిర్వహణ లో ఆ బంధాన్ని సైతం విడువమన్నది!!
సత్యమే జయించునన్నదీ!
అసత్య విజయం జరుగదన్నది!!
లోకులంతా సోదరులై మెలగాలని కోరుకున్నదీ!!
కనుకే, జగతికే నా జాతి ఆదర్శవంతమైనది!!!