ఎవరో ఒకరు... ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు......
మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి
వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది ..
ఎవరో ఒకరు... ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు
కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా అనుకొని కోడి కూత నిదరపోదుగా.. జగతికి మేలుకొలుపు మానుకోదుగా..
మొదటి చినుకు సూటిగా దూకి రానిదే మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే.. వాన ధార రాదుగా నేల దారికి ప్రాణమంటు లేదుగా బ్రతకటానికి..
ఎవరో ఒకరు... ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు
చెదరక పోదుగా చిక్కని చీకటి మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి..దానికి లెక్క లేదు కాళరాతిరి..
పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని రెప్ప వెనక ఆపని కంటి నీటిని సాగలేక ఆగితే దారి తరుగునా? జాలి చూపి తీరమే దరికి చేరునా..?
ఎవరో ఒకరు... ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు
యుగములు సాగిన నింగిని తాకక ఎగసిన అలల ఆశ అలసిపోదుగా ఓటమి ఒప్పుకుంటూ ఆగిపోదుగా
ఎంత వేడి ఎండకే ఒళ్ళు మండితే.. అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా
అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా?.. నల్ల మబ్బు కమ్మితే చల్లబడడా..?
ఎవరో ఒకరు... ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు