నాలోగల భావ తృష్ణకై ఈ బ్లాగు....భావ వ్యక్తీకరణకు ఇదే బహు బాగు...కవినైతే కాను...కానీ కమ్మని కలల కనుపాపను నేను...వాదులాడను...ప్రతి వాదానికీ ప్రతివాదిని కాలేను...మనసుకవంటే ఎంతో ఇష్టం...మనసున్న వారంటే ఇంకా ఇష్టం...!తలపుల తలుపుల కాపరిని నేను... మతికీ మదికీ నడి లోగిలి నేను...మధుర భావ స్మృతినీ... మనోరథ సారథినీ...నేను...నను నడిపే దైవానికి నిత్య విధేయుడను....ఫణీంద్ర కుమార్ నామధేయుడను...!!!
Sunday, July 24, 2011
నాకు దేవుడంటే చాలా ఇష్టం...
నేను ఏడిస్తే ఆయన ఓదారుస్తాడు..
ఆనందలో తేలియాడితే తానందులోనే దాగుంటాడు
బాధ గా ఉందంటే నన్ను దగ్గరికి తీసుకుంటాడు..
ఒంటరినీ అంటే తానున్నానని గుర్తు చేస్తాడు...
తన్మయత్వం తో కౌగిలించుకుంటే తల నిమురుస్తాడు...
చిన్న పిల్లాడిలా మారాం చేస్తే చిలిపిగా నవ్వేస్తాడు...
నా వల్ల కాదని చేతులెత్తేస్తే తన చేయందిస్తాడు...
భక్తి భావం కంటిలోకి ఉప్పొంగితే ఆ నీటితో మనఃశుద్ధి చేస్తాడు
నీవే తప్ప దిక్కులేదని వేడితే మరేం అలోచించక నాకై వచేస్తాడు..
నేను భయపడితే తానే ధైర్యమౌతడు...
నేనేమౌతానో అనుకున్నప్పుడు...నా దారీ వెలుగూ తానౌతాడు..
ఏమీ వద్దనిపిస్తుంది ఆయన తోడుంటే..
ఏమీ అడగాలనిపించదు ఆయన్ని చూస్తుంటే..
ఏ పలుకూ పెదాలు దాటనంటుంది ఆ నామస్మరణ జరుగుతున్నంత సేపు...
ఏ అలోచనలూ నన్ను తాకనంటాయి ఆ చల్లని చూపు నాపై ప్రసరిస్తున్నంత సేపూ...
నాకై ఇన్ని చేసిన అ అంతర్యామికి నేనేమివ్వగలను..?
నిర్మల మైన మనసు... నిజయితీ గల మాటా తప్ప
నా జీవితం లో అడుగూ ఆయనే...గమ్యం అయనే...మార్గమూ ఆయనే...
Subscribe to:
Posts (Atom)