Monday, November 24, 2008

ఓ ప్రియ నేస్తమా...

కనిపించే దైవాలు కనిపెంచే తల్లిదండ్రులు...
ఈ జీవితపు మజిలీలలో ననువీడి వెళతారు!

నిండు నూరేళ్ళూ తోడుంటానన్న భార్యను సైతం....
ఇంటి వద్దే విడిచి నేను పోతాను!

కోటి ఆశలు పెట్టుకున్న కొడుకులు
వల్లకాటి లో నన్ను మసి చేసి పోతారు!

బూడిదగా మిగిలినా...... నేనీ భువినే వీడి వెళ్ళినా....
నా ంకొలువుండేది నీవొక్కడివే నేస్తమా... ఇహ పరాలకందని ఓ గొప్ప భావమా!


ఎన్నో ఆటుపోట్లు గల ఈ జీవననావలో,
కష్టాలు నన్ను సజీవ సమాధి చేస్తూంతే....
ఎదురైన కష్టాలను చూసి ఆప్తులందరూ
నన్ను ఒంటరిని చేసి పోతూంటే....


జన్మ జన్మల నా పుణ్యమే దాల్చెనేమో ...
స్నేహితునిగా నీ రూపము!
వచ్చిన ప్రతి కష్టాన్ని ఎదిరించమన్న నీ ధైర్యమె...
కాదా నాకు దైవ సమానము!



నీ చెలిమి నా చెంతనున్నంత కాలము....
చెక్కిలిపై చిందలేదు ఏ కన్నీరు!
ఉప్పొంగే జలధిని కనురెప్పలు దాచేసినా....
అయ్యుండదే అది ఆనందపు పన్నీరు!


అరుదైన వరమే అయినా...
పుట్టిన నాడు నేనెరుగను నీ స్నేహము!
మట్టిలో కలిసినా మరువగలదా...
నా మది నీతో పంచుకున్న బంధము !
ఎవరెన్ని విధాల వర్ణించినా ,
తరగిపోదు, కరిగిపోదు ఈ గంధము!


ఎన్ని పదాలు కూర్చి...ఎన్ని జన్మలెత్తి..
తీర్చుకోగలను నేను చేసుకున్న ఋణము!
నీ స్నేహాన్ని వరంగా పొంది...
అయ్యనె నా జన్మ మిక్కిలి ధన్యము!!!

No comments: