Monday, November 24, 2008

దూరమైన మిత్రమా....నా మది పలుకు గానమా...

విజయంలో.... ఓటమి లో....
వెన్నెల్లో.....నిశిరాతిరిలో....
ఒంటరితనం నన్ను బాధించే వేళలో.....


బాధల్లో....బాధ్యతల్లో....
గుండెల్లో...కడగండ్లలో....
ఒడిదుడుకులు కడునిండిన నా ప్రతీ అడుగులో!


నావెన్నంటి నిలిచి...
నాతోటి నడిచి...
తడి నిండిన నా కంటిని...
నిండు మనసుతో తుడిచి...

కష్టాలలో ఓదార్చి...
నేనున్నానన్న ధైర్యాన్నిచ్చి ...
శిధిలమైన నా ప్రతిభకు ప్రోత్సాహమందించి...
నా లోని మంచికి ఒక రూపంగా నిలిచీ...
నీ యెదవాకిట నా కొరకు ఎర్ర తివాచినే పరిచిన నా నేస్తమా....!

క్షరమవ్వని అక్షరమాలను తప్ప ఏమివ్వలేని
ఈ పేద హృదయం నీకై వేచియున్నది...
నన్ను ప్రతిబింబించే నీ మదికై ఆరటపడుతున్నది...
మన తీపి స్నేహాలు జ్ఞాపకాలుగానే ఉండరాదని నన్ను పోరుచున్నది...

కఠినమైన కాలం తరలి రాకున్నా..
విడదీసిన కర్తవ్యం దరి చేరనివ్వనన్నా...
పెరిగిపోయే అహం మాటవినకున్నా...

చెలిమినే బలిమిగ చేసి
మన కలిమిని జగతికి చాటగ
నన్నక్కున చేర్చుకొన .........
రావా నేస్తమా....
నా పాణాధిక భావమా....!!!

No comments: