నాలోగల భావ తృష్ణకై ఈ బ్లాగు....భావ వ్యక్తీకరణకు ఇదే బహు బాగు...కవినైతే కాను...కానీ కమ్మని కలల కనుపాపను నేను...వాదులాడను...ప్రతి వాదానికీ ప్రతివాదిని కాలేను...మనసుకవంటే ఎంతో ఇష్టం...మనసున్న వారంటే ఇంకా ఇష్టం...!తలపుల తలుపుల కాపరిని నేను... మతికీ మదికీ నడి లోగిలి నేను...మధుర భావ స్మృతినీ... మనోరథ సారథినీ...నేను...నను నడిపే దైవానికి నిత్య విధేయుడను....ఫణీంద్ర కుమార్ నామధేయుడను...!!!
Sunday, September 30, 2007
అగాథమౌ ఈ జీవితంలో...
నా ప్రతీ ప్రయత్నం విఫల రాగం పాడుతున్నప్పుడు...
ఇక గెలవలేనని ప్రతీ ఓటమి నన్ను గేలి చెస్తున్నప్పుడు...
నిరాశ,నిశ్పృహలే నేస్తాలుగా, మాయదారి ముసుగుతో నన్నావహించినప్పుడు...
ఈ అదునుతో కల్లు తాగిన కోతిలా నా మనసు అదుపు తప్పుతున్నప్పుడు...
బాధ తన బంధుగణంతో నా యెద పై దాడినారంభించినప్పుడు...
నాలోని బలహీనతలు వాటికి తమ సహకారమందించినప్పుడు...
అపుడూ...
బతుకంటే ఇంతేనని...
ఏ ఆశల్నీ పెంచుకోకూడదని...
పెరుగుతున్నవాటిని ఆదిలోనే తుంచుకొని...
గమ్యమెరుగని పయనమెంచుకొని సాగాను...
......ఈ జీవితాన,నాతో నేను నటించసాగను.
ఆశయాలను సమాధి చెసుకొని...
కలల్ని కనటం ఇక మానుకొని...
అయినవారి యెదుట నవ్వును,బలవంతాన,పులుముకొని...
కాలం విలువ తెలియని శిలలా జీవించాను...
......ఏ ఉలీ నన్నంటరాదనే చీకటితో,సహజీవించాను.
కానీ...
కాలానికి కరుగనిదొకటి నన్నక్కున చేర్చుకుంది,
ఈ జీవితపు విలువలు నాకు తెలిసేట్టు చేసింది,
మళ్ళీ నన్నీ విజయపథాన నిలబెట్టింది!
అపజయాలతో ఆగిపొతే విజయం వైపుకు నడవలేమనీ...
ఏ క్షణానా మనసులో కృంగిపోరాదనీ...
నిస్పృహను మించిన నరకమొకటి లేదని.
కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలనీ...
ఎన్ని ఓటములొచ్చినా విశ్వాసం కోల్పొకూడదనీ...
మనిషిగా జీవించేది గెలవడం కోసమేనని.
...ఇలా నాకో జీవిత పాఠం నేర్పింది,
పెద్ద కలలను కనగలిగే ధైర్యాన్నిచ్చింది,
వాటిని నెరవేర్చుకొనే సాహసాన్నందించింది,
రెప్పపాటులో నా జీవిత దృకోణాన్ని మార్చేసిందీ,
నా చుట్టూ అండగా నిలిచిన, 'నా'వాళ్ళు, నాపై వుంచిన సడలని నమ్మకం!
ఏనాడూ నా కంటిలో నీరు చూడకూడదన్న వారి ధృడ సంకల్పం!
జీవితాన్ని ప్రతీ క్షణం ఆశ్వాదించాలనే వారి మహోన్నత గుణం!
అందుకే
...అంతులేని 'నా'వారి అభిమానాన్ని పొందగలిగే
వరమిచ్చిన భగవంతునికి నమస్కరిస్తూ...
'నా'అనే వారిని తన చుట్టూ ఉంచుకోవటంలో వున్న
ఆనందం అనుభవిస్తేనే తెలుస్తుందని తెలియజేస్తూ...
మీ
ఫణిరాజ్
Saturday, September 8, 2007
ప్రతిభదే విజయం!
ఎవరి అంచనాలనందుకోవాలని
చిగురించును ప్రతి ఉదయం!
ఎవరి ఆశలను తీర్చాలని
పరిమళించును ప్రతి పుష్పం!
ఏ ఆకాశాలను తాకాలని
ఎగురును ఆ పావురం!
ప్రతీ వ్యక్తి లో వుండునే ఓ ప్రత్యేక గుణం...
నిస్పృహ లో దాని ఉనికి మరచుట క్షమించరాని నేరం.
అందుకే,ఒకరికోసం వదులుకోకు నీ చేతిలోని ఈ అద్భుతం...
నీవు కాదంటే అనాథలా ఆక్రోశించదా నీలొని ఆ నైపుణ్యం.
ఎన్ని జన్మల తపస్సు ఫలితమో,సిద్దించనే నీకీ వరం...
నిన్ను నీవు ప్రేమించనప్పుడు,ఆ ఫలం నిష్ప్రయోజనం.
కనుకే,నీకై నీవు బ్రతుకుతూ,చేసుకో నీ జీవితం ఓ నందనం...
వెదుక్కుంటూ వచ్చి సమర్పించదా నీకప్పుడు,విజయం తన వందనం.
.............ఫణిరాజ్
Sunday, September 2, 2007
my short film
http://www.youtube.com/watch?v=Ze8Z2qWg35M
this is in telugu language
i heartly invites ur comments
ఓ రంగుల పావురం......
ఇటువంటి నేపధ్యం లొ నన్ను ఒక పావురం లాగ ఊహిస్తు నేనొక కవితో, గేయమో, నా మనసుకయిన గాయాన్ని అలనే రాశాను. రాగమేదైన కడితే పాటౌతుందేమో. అది ఇలా సాగుతుంది..........
ఆ రంగుల లొకంలో తన రెక్కలు విప్పాలని...
ఓ పావురం తహతహలాడింది.
తన మనసును పంచే నెస్తం కొసం ఎన్నొ ఆశల్తో,ఇంకెన్నొ ఊహల్తో...
తన పలుకులు తెలిపి, తొలి అడుగులు వేసింది.
తీరా ఆ తీరం చేరాక....
స్వచ్ఛమైన తన తెల్లదనం ఆ రంగుల మధ్యన శూన్యం .
వెక్కి వెక్కి ఎడ్చిన తరుణానే తెలిసివచ్చెనీ కఠిక నిజం.
ఒంటరితనాన్ని తొడుగా, కంటి ధారను యేరుగా మార్చిందీ వైనం.
అదే సమయంలో తనకు....
దూరంగా సుదూరంగా వినిపించెనేవొ తేనెల చినుకులు .
గాఢంగా నిగూఢంగా అవి నాటెనేవో ఆశల మొలకలు.
తనలాంటి రూపం తలచి, తనను తానే మైమరిచేల, సాగించెను ఊహలు.
ఆ మరు క్షణమే....
ఆశల మేడలెక్కి అకాశనికి పరుగులు తీసి ఆ పక్షిని చూసింది.
తన కలలు కరిగి, అసలు రంగులు తెలిసి గుండె చెదిరిపొయింది.
తన వారికిచ్చిన మాటను తప్పి, ఆశయాలను సమాధి చేసి...
ఒక్క మనసుకోసం వెనక్కి వెళ్ళలెక ముందుకు సాగింది.
మనసును రాయిగ మార్చింది.
ఫణిరాజ్