Sunday, September 30, 2007

అగాథమౌ ఈ జీవితంలో...


నా ప్రతీ ప్రయత్నం విఫల రాగం పాడుతున్నప్పుడు...
ఇక గెలవలేనని ప్రతీ ఓటమి నన్ను గేలి చెస్తున్నప్పుడు...

నిరాశ,నిశ్పృహలే నేస్తాలుగా, మాయదారి ముసుగుతో నన్నావహించినప్పుడు...
ఈ అదునుతో కల్లు తాగిన కోతిలా నా మనసు అదుపు తప్పుతున్నప్పుడు...

బాధ తన బంధుగణంతో నా యెద పై దాడినారంభించినప్పుడు...
నాలోని బలహీనతలు వాటికి తమ సహకారమందించినప్పుడు...



అపుడూ...

బతుకంటే ఇంతేనని...
ఏ ఆశల్నీ పెంచుకోకూడదని...
పెరుగుతున్నవాటిని ఆదిలోనే తుంచుకొని...
గమ్యమెరుగని పయనమెంచుకొని సాగాను...
......ఈ జీవితాన,నాతో నేను నటించసాగను.


ఆశయాలను సమాధి చెసుకొని...

కలల్ని కనటం ఇక మానుకొని...
అయినవారి యెదుట నవ్వును,బలవంతాన,పులుముకొని...
కాలం విలువ తెలియని శిలలా జీవించాను...
......ఏ ఉలీ నన్నంటరాదనే చీకటితో,సహజీవించాను.


కానీ...


కాలానికి కరుగనిదొకటి నన్నక్కున చేర్చుకుంది,
ఈ జీవితపు విలువలు నాకు తెలిసేట్టు చేసింది,
మళ్ళీ నన్నీ విజయపథాన నిలబెట్టింది!



అపజయాలతో ఆగిపొతే విజయం వైపుకు నడవలేమనీ...
ఏ క్షణానా మనసులో కృంగిపోరాదనీ...
నిస్పృహను మించిన నరకమొకటి లేదని.

కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలనీ...
ఎన్ని ఓటములొచ్చినా విశ్వాసం కోల్పొకూడదనీ...
మనిషిగా జీవించేది గెలవడం కోసమేనని.



...ఇలా నాకో జీవిత పాఠం నేర్పింది,
పెద్ద కలలను కనగలిగే ధైర్యాన్నిచ్చింది,
వాటిని నెరవేర్చుకొనే సాహసాన్నందించింది,
రెప్పపాటులో నా జీవిత దృకోణాన్ని మార్చేసిందీ,


నా చుట్టూ అండగా నిలిచిన, 'నా'వాళ్ళు, నాపై వుంచిన సడలని నమ్మకం!
ఏనాడూ నా కంటిలో నీరు చూడకూడదన్న వారి ధృడ సంకల్పం!
జీవితాన్ని ప్రతీ క్షణం ఆశ్వాదించాలనే వారి మహోన్నత గుణం!


అందుకే
...అంతులేని 'నా'వారి అభిమానాన్ని పొందగలిగే
వరమిచ్చిన భగవంతునికి నమస్కరిస్తూ...

'నా'అనే వారిని తన చుట్టూ ఉంచుకోవటంలో వున్న
ఆనందం అనుభవిస్తేనే తెలుస్తుందని తెలియజేస్తూ...


మీ
ఫణిరాజ్

2 comments:

రాధిక said...

caalaa baagundamDi.

ఫణిచంద్ర said...

thanks andi radhika gaaru..
actually blog raasi..choosi chaalaa kalam ayipoindandi...
inkaa busy gaa undatam valla...enno alochanalu alochanallane undi potunnai...tappa kundaa tvaraloe oka manchi bhavam unna kavita toe vastaanandi...