హలో,
నా పేరు ఫణీంద్ర .చిన్న కథలు రాయటం, కవితలు రాయటం అంటే నాకు చాలా ఇష్టం. సినిమాలంటే కూడా ఇష్టమే. ఆట , ఆ సినిమా పేరు విన్నప్పుడు తమాషాగ అనిపించి నాకు నేనే ,సినిమా గురించి కొంచం తెలుసుకుని, ఆ సినిమా ఆడియో రిలీజ్ కాక ముందే ఒక చిన్న సిట్యుయేషన్ అనుకొని నా మనసుకి తోచింది ఇలా రాసాను (నాకు ఏ రాగం రాదు ,ఏదైన కడితే పాటౌతుందేమూ).దాన్ని మీ అందరితొ పంచుకోవాలని ఇలా....
ఆట
I
He: ప్రియతమా , She: ఊ...
He: మనసును గెలవగలుగు ఆట ఒకటి నీకు నేర్పనా… She: ఊహూ...
He: ఏ....? ఎద సవ్వడినే మాటగ మార్చే మౌనం, నీకది ముందే తెలిపెనా..
He:మాట మాటను మనసుకు చెర్చే మార్గము సైతం చూపెనా.. She: హా.......
He: ఊ... ఇవేవి తెలియని వెళ అది ప్రేమేనని తెలుపనా…
He:ఆ ప్రేమతో నీ మనసును గెలవనా..
II
He:ఎద చాటున విరబూసిన వెన్నల తొటే మన ఆట స్థలం.
She: అలిసిన ప్రతి మనిషిని అలరించటమే తన లక్షణం.
He:కనుపాప చిరునవ్వుతో పులకించిన మదికే, మొదట ఆడే వరం…
She: మమతల తలపులు పండిన సమయాన, Both:విజేతలమే మనమిద్దరం.
III
He:బెదిరిచే కష్టాలను ఎదిరిస్తేనే ఆటలో నిలబడగలం.
She: ఎదుర్కొన్న ఆ కష్టాలే భవితలో ఓ తీపి జ్ఞాపకం.
He:ఆశల వేటలో నిస్పృహ కోటలు దాటే హృదయమే, నిండైన బలం.
She: ధైర్యం నిండిన గుండెలకి పులి మీద స్వారి కూడా, Both:ఒక సంబరం ..,మనువాటలో అది సాధరణం.
మీ
ఫణీంద్ర
No comments:
Post a Comment