Saturday, August 22, 2009

నాన్న కోసం...

ప్రపంచం పరిచయమయ్యే క్రమాన తనే నా తొలినేస్తం...
సంతోషం తో ఉప్పొంగిపోయేదా హృదయం...నా చిన్ని విజయానికి సైతం!!!

తొలి అడుగులు వేసేప్పుడు తన అడుగులే నాకాదర్శం....
నా ప్రతి అడుగు తీరం చేరాలన్నదే తన ఆరాటం!!!

ఆకలి నిండిన కడుపును నే చూడకూడదన్నది తన ఉద్దేశ్యం...
ఎరుగనైతి, నా ఆకలికై తను అనుభవించు కష్టాల సందేశం!!!

ఓటమెదురైన ప్రతి సారీ నన్నాదరించినదా హస్తం...
వెన్ను తట్టి ప్రోత్సహించి చేసిందీ, విజయపు దిశానిర్దేశం!!!

నే దారి తప్పినప్పుడే, తడి రుచి చూసే తొలిసారి ఆ నయనం....
మరువలేనూ, నా మార్గం మార్చేందుకు తన గమ్యం వదిలేసిన వైనం!!!

ఇరుకైన దోవల్లో నన్నెత్తుకుని కొనసాగించెను తన పయనం....
తడబడు ప్రతి అడుగుకూ బదులిచ్చు తన నైజం, నింపిందీ నాలో ఆత్మవిశ్వాసం!!!

తనకు కొడుకును చేసి, అడగకనే ఇచ్చెను ఆ దైవం నాకీవరం...
జన్మంతా అర్పించినా తీరేనా నన్నీ స్థాయికి చేర్చిన తండ్రి రుణం!!!

లోకం ఎరిగినంతలో తండ్రి హృదయం పాషాణం....
లోకులు ఎరుగరైతిరో ఎమో సమస్త నదుల జన్మ స్థానం!!!

పది మాసాలే మోయు కడుపున బిడ్డను ఏ తల్లైనా...
ఆ కొద్ది సేపే అనుభవించు తల్లి, ఎంతటి పురిటి కష్టమైన!!!
ఎదిగేంత వరకూ మోసేను తండ్రి తన భుజముల పైన...
భరించు ఎదురుదెబ్బలు తన గుండె మాటున, ఎదిగే ప్రతి సందర్భం లోనా!!!

2 comments:

మరువం ఉష said...

తల్లితండ్రుల పట్ల ప్రేమానురాగాలున్న ఎవరమైనా చెప్పుకునే స్పందనలివే... ఆ నాన్న కూతురు!!! http://maruvam.blogspot.com/2009/06/blog-post_21.html అమ్మ అమ్మే - తను కాదా అనాది దేవత? http://maruvam.blogspot.com/2009/04/blog-post_24.html నా వరకు హెచ్చుతగ్గులు లేకుండా ఇద్దరూ పూజ్యనీయులే, ప్రేమ దేవతలే.

ఫణిచంద్ర said...

ఇద్దరూ పూజనీయులే...సదా స్మరణీయులే అనుసరణీయులే.....ఇద్దరూ గొప్ప వారే...కానీ ఈ మధ్య చాలా చోట్ల పాపం నాన్న ని సరిగా అర్థం చెసుకోలేక...రాసిన రాతలు చూసి...నేను ఇలా స్పందించానంతె...
మీ బ్లాగ్ లోని భావాలు అద్బుతం గా ఉన్నయండి.. ..